ఎందరో పోలీసులు మా గుండెల్లో చిరంజీవులై నిలిచారు : వి.సుధాకర్ జాతీయ అధ్యక్షులు – ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా

విధి  నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు హృదయపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్స్ అసోసియేషన్ – ఇండియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ ట్విట్టర్ ద్వారా   ఆయన స్పందిస్తూ విధి నిర్వాహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరులకు  హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. COVID-19 సందర్బంగా Front Line Warriors గా సేవలందించి అమరులైన పోలీసు సోదరులకు జోహార్లు. మీ త్యాగాలు చిరస్మరణీయం. పోలీసు అమరవీరుల స్మృతికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నాను. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, పౌరుల ప్రాథమిక హక్కులు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణలో బాధ్యతాయుతమైన సేవలు అందించే పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని, అరాచక శక్తులను అణచివేసే ప్రయత్నంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన ఎందరో పోలీసులు ప్రజల హృదయాల్లో చిరంజీవులై నిలిచారని కొనియాడారు.

About the Author

Leave a Reply

Your email address will not be published.

You may also like these