ఈ నెల 29 న భారత్ కి శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటాబయ రాజపక్స

ఈ నెల 29 న భారత్ కి శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటాబయ రాజపక్స
భారత్ లో పర్యటించనున్న శ్రీలంక కొత్త అధ్యక్షుడు
కొలంబో: శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటాబయ రాజపక్స భారత్‌లో పర్యటిం చనున్నారు. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఈనెల 29న భారత్‌లో పర్యటించనున్నట్టు భారత విదేశాంగమంత్రి జై శంకర్‌ వెల్లడిం చారు. రెండు రోజలు శ్రీలంక పర్యటనలో ఉన్న జై శంకర్‌… రాజపక్సతో సమవేశమయ్యారు. అధ్యక్షుడికి మోడీ వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపిన లేఖను రాజపక్సకు అందించారు. రాజపక్స నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదే ఆయనకు తొలి అధికారిక పర్యటనయ్యే అవకాశముంది. 

రాజపక్స నాయకత్వంలో ఇరు దేశాల మధ్య అభివృద్ధి, శాంతి, భద్రతా పరమైన అంశాలు మరింత బలోపేతమవుతాయని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. శ్రీలంక ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం ప్రధాని మోడీ స్వయంగా రాజపక్సకు ఫోన్‌ ద్వారా భారత ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలిపారు. రాజపక్స నాయకత్వంలో శ్రీలంకలో శాంతి భద్రతలు మెరుగుపడి ప్రజలు అభివృద్ధి చెందుతారని మోడీ ప్రగాఢ విశ్వాసాన్ని కనబర్చారు. అంతేగాకుండా, ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక వాతావరణంలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతమవుతాయని ఆయన ఆకాంక్షించారు.

Leave a Reply