బాక్సింగ్ లో భారత్ కి స్వర్ణం తెచ్చిన తెలుగోడు :

బాక్సింగ్ లో భారత్ కి స్వర్ణం తెచ్చిన తెలుగోడు :
అంతర్జాతీయ స్థాయిలో ఇండియా కి పేరు తెచ్చిన హైదరాబాది 
హైదరాబాద్: అంతర్జాతీయ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వనస్థలిపురం యువ డిఫెన్స్ అకాడమీకి చెందిన నరేశ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఇటీవల బ్యాంకాక్‌లో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో పాల్గొన్న నరేశ్ విజేతగా నిలిచి బంగారు పతకాన్ని సాధించాడు. బుధవారం నగరానికి వచ్చిన నరేశ్‌ను శంషాబాద్ విమానాశ్రయంలో యువ జూనియర్ కళాశాల సిబ్బంది, విద్యార్థులు ఘనంగా స్వాగతించారు. అనంతరం కళాశాలలో అభినందన సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నందికంటి భాస్కర్ మాట్లాడుతూ.. తమ విద్యార్థి అంతర్జాతీయ స్థాయికి ఎదగడం ఎంతో గర్వించదగిన విషయం అన్నారు. నరేష్ ను కళాశాల డైరెక్టర్, సిబ్బంది, అతని స్నేహితులు మనస్పూర్తిగా అభినందించారు.

Leave a Reply