తెలంగాణ RTC జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కి షాక్

తెలంగాణ RTC జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కి షాక్
RTC జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పై మండిపడుతున్న కార్మికులు
తెలంగాణ ఆర్టీసీ సమ్మెపై జేఏసీ చేసిన ప్రకటన పలువురు కార్మిక సంఘాల నేతలకు మింగుడుపడటం లేదు.షరతుల్లేకుండా కార్మికులను విధుల్లోకి తీసుకుంటే సమ్మె విరమిస్తామన్న జేఏసీ ప్రకటనతో కొంతమంది విబేధిస్తున్నారు.అదే జరిగితే.. 47రోజుల సమ్మెకు,కార్మికుల బలిదానాలకు అర్థం లేకుండా పోతుందంటున్నారు. రూ.400కోట్లు ఆర్థిక నష్టాన్ని పక్కనపెట్టి సమ్మె విరమిస్తామనడం కార్మికుల కోణంలో న్యాయ సమ్మతం కాదని నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్ఎంయూ) నాయకులు అభిప్రాయపడ్డారు.
 

 

 

ఆర్టీసీ కార్మికులు 47రోజులుగా చేస్తున్న సమ్మెను గాలికొదిలేసి.. కార్మికులను నట్టేట ముంచారని జేఏసీ నాయకులపై ఎన్ఎంయూ నాయకులు విమర్శలు గుప్పించారు. ఒక్క డిమాండ్ కూడా పరిష్కారం కాకుండానే సమ్మెను ఎలా విరమిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకుండానే సమ్మెను విరమిస్తామనడంపై కార్మికులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.జేఏసీ నేతలు కార్మికుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారని.. వారు విధుల్లో చేరడానికి సిద్దంగా లేరని తెలిపారు. సమ్మె కొనసాగింపుపై జేఏసీ-1 గురువారం సమావేశమవుతున్నట్టు చెప్పారు.
 
కాగా, జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి ప్రకటనపై కార్మిక వర్గాలతో పాటు సామాన్య జనంలోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఇంతా చేసి అశ్వత్థామరెడ్డి సాధించిందేటని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఆర్టీసీ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన అశ్వత్థామరెడ్డి ఈ విషయంలో చిక్కుల్లో పడ్డట్టే కనిపిస్తోంది. కార్మికవర్గం నుంచి ప్రశ్నలు తలెత్తితే ఆయన ఏ సమాధానం చెబుతారోనన్న చర్చ జరుగుతోంది.

 

 

Leave a Reply