కోవిడ్ – 2019(కరోనా) పై ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ తాజా అధ్యయనం

కోవిడ్ – 2019(కరోనా) పై ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ తాజా అధ్యయనం

చైనాతోపాటు ప్రపంచ దేశాలను భయకంపితుల్ని చేసిన కరోనా (కోవిడ్‌–19) వైరస్‌ వల్ల ప్రపంచానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉందని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ (ఏఎన్‌యూ) హెచ్చరిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ప్రపంచ దేశాలు మరింత సమన్వయంతో పనిచేయాల‍్సిన అవసరం ఉందని పేర్కొంది. భయానకంగా మారిన కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా కనిష్టంగా 15 లక్షల మంది మృత్యువాత పడే ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ నిర్వహించిన అధ్యయనం హెచ్చరించింది. పర్యవసానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కనిష్టంగా లక్షల కోట్ల రూపాయల మేరకు నష్టం వాటిల్లుతుందని అధ్యయనంలో తేలినట్టు పేర్కొంది. కోవిడ్‌ వైరస్‌ బారిన పడిన ప్రతి దేశం తమ జీడీపీలో దాదాపు ఎనిమది శాతం నష్టపోతుందని హెచ్చరించింది. ఇప్పటికే అభివృద్ధి చెందిన, వర్ధమాన దేశాల స్టాక్‌ ఎక్స్ఛేంజీలు కుప్పకూలాయి.చైనా తర్వాత బ్రిటన్, అమెరికా దేశాల్లో కరోనా మృతుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రమాదం ఉందని ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్శిటీ తరఫున అధ్యయనం జరిపిన వార్‌విక్‌ మ్యాక్‌కిబ్బన్, రోషన్‌ ఫెర్నాండో తెలిపారు. చైనాలో కరోనా వైరస్ బారిన పడిన వారిలో మడతి చెందిన వారి సంఖ్య 3.4 శాతం ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చైనాలో వుహాన్‌లో గత డిసెంబర్‌ 31వ తేదీన మొదటి వైరస్‌ కేసు నమోదైన విషయం తెల్సిందే.

Leave a Reply